Khammam
Trending

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మ*హత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మ*హత్య

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మ*హత్య..

Web desc :
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కురవి మండలంలోని నల్లెల్ల శివారు గాజ తండా జీపీ పరిధి టేకుల తండాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలం కంచర్లగూడెం తండా గ్రామానికి చెందిన భూక్య శాంతి కుమార్తె కల్యాణి(27)తో టేకుల తండాకు చెందిన గుగులోత్‌ నరేశ్‌కు పరిచయడం ఏర్పడింది.

2017లో ప్రేమించుకున్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. దీంతో కల్యాణి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో గుర్తించిన కుటుంబీకులు, భర్త నరేశ్‌ హుటాహుటిన మానుకోటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సంతోశ్‌ గురువారం తండాకు చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌ తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల బాబు, 11 నెలల పాప ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button