Andhra PradeshPolitical

కోటబొమ్మాళిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం

కోటబొమ్మాళిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం

కోటబొమ్మాళిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవం
​
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది. రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు, స్థానిక ఎన్టీఆర్ భవన్ లో టిడిపి మండల అధ్యక్షులు బోయిన సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కోటబొమ్మాళి పంచాయతీ పరిధిలోని మంచాలపేట, సీతన్నపేట, బంజీరుపేట, ఉప్పరపేట గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఎంపీటీసి స్థానాలు (1, 2) బీసీ, ఎస్సీ మహిళలకు రిజర్వ్ కావడంతో, అర్హులైన అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించారు. పార్టీ పెద్దలు మరియు గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేశారు.

​ఎంపీటీసీ -1 అభ్యర్థిగా: కల్లి నాగయ్యరెడ్డి కోడలు, సదాశివ రెడ్డి భార్య కల్లి యమునా రెడ్డిని
​ఎంపీటీసీ-2 అభ్యర్థిగా : ఎస్సీ వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ సింహాద్రమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

​అందరి అభిప్రాయాలను సేకరించి, పార్టీ ఐకమత్యానికి పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోయిన రమేష్, టిడిపి పట్టణ అధ్యక్షులు కోరాడ గోవిందరావు, కల్లి లక్ష్మణ రెడ్డి, నాగయ్య రెడ్డి, సకలా భక్తుల వైకుంఠరావు, తాళాసు కృష్ణారావు, లాడి వెంకటేశ్వరరావు , లాడి దాలెప్పన్న, కోరాడ ప్రతాప్ , సకలా భక్తుల రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button