HyderabadPoliticalTelangana

రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బలవన్మరణo...

రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బలవన్మరణo...

రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బలవన్మరణo…

Web desc : పాతబస్తీలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నగరంలోని హుస్సేనీ ఆలం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ బలవన్మరణానికి పాల్పడ్డారు.

అలీముద్దీన్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వ్యక్తిగత కారణాల వల్ల తన వద్ద ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తుపాకీ పేలుడు శబ్దం గమనించిన చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే హుస్సేనీ ఆలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన అలీముద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button