HyderabadPoliticalTelangana

నమ్మిన వాళ్లను నట్టేట ముంచడమే కేటీఆర్ నైజం... కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్

నమ్మిన వాళ్లను నట్టేట ముంచడమే కేటీఆర్ నైజం... కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్

నమ్మిన వాళ్లను నట్టేట ముంచడమే కేటీఆర్ నైజం… కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచడమే కేటీఆర్ నైజం అని ఆరోపించారు. ప్రతిమ శ్రీనివాస్‌పై విచారణ చేయాలని లేఖ రాయడం కేటీఆర్ నైజాన్ని బయట పెట్టిందని అన్నారు.

బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో కవిత శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత పలు అంశాలపై స్పందించారు. ”ప్రతిమ శ్రీనివాస్‌ రావును ఇరికించేందుకు సీఎంకు కేటీఆర్ లేఖ రాశారు. నమ్ముకున్నవారిని కేటీఆర్ నట్టేట ముంచుతాడు అనడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. వాస్తవానికి అది ఏం స్కామ్ అయిందో నాకు తెలియదు.

నిన్న ముఖ్యమంత్రి గారు అనేక మాటలు చెప్పారు. ఆడ 8000 కోట్ల స్కామ్ అయింది అన్నారు. కేసీఆర్ ఇంటికి పైప్‌లైన్లు ఉన్నాయన్నారు. వాస్తవానికి నాకైతే వాటి మీద అవగాహన లేదు. కానీ ప్రతిమ శ్రీనివాసరావు గారు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర ఫ్రెండ్స్ ఎవరూ లేనప్పుడు… తెలంగాణ ఉద్యమ కాలంలో అటుకులు తిని ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీని ఆదుకున్న ఏకైక వ్యక్తి ఆయన.

ఆయన మా వినోదన్న వాళ్ళ సొంత బ్రదర్. పార్టీకి చాలా సందర్భాల్లో సహాయం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన మీద ఉత్తరం రాస్తున్నాడని కేటీఆర్ తెలిసి రాశారా? లేదా? అనేది నాకు తెలియదు.

కేటీఆర్ కావాల్సి రాసి ఉంటే… సహాయం చేసినటువంటి వ్యక్తుల్ని కూడా మోసం చేయడం ఆయన చేస్తున్నారని తెలుసుకోవాలి. ఎందుకంటే సహాయం చేసిన సొంత మనుషుల్ని, సొంత కులబాంధవుల్ని, అదేవిధంగా నాలాంటి సొంత తోడబుట్టిన వాళ్ళని కూడా కిరాయి మనుషుల్ని పెట్టి తిట్టిస్తున్న వ్యక్తి కేటీఆర్.

కేటీఆర్ నైజం ప్రజలు అర్థం చేసుకోవాలి. అవినీతి జరిగిందా? జరగలేదా? నాకు తెలియదు. అవినీతి జరిగితే ఫైట్ చేయండి, నేను కాదనట్లే. అవినీతిపరులను కాపాడమని నేనేం అనట్లే. కానీ తెలిసి రాసిండో, తెలియక రాసిండో, మరి ఏం చేసిండో నాకు తెలియదు” కవిత అన్నారు.

రాష్ట్రంలో కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గోవా, ఢిల్లీలకు తిరుగుతూ ప్రజాస్వామ్యంపై లెక్చర్లు ఇస్తున్నారని కవిత విమర్శించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలు పూర్తిగా ఆయన నిస్సహాయతను తెలియజేశాయని అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ప్రపంచం మొత్తం హెచ్చరికలు చేసిందని చెప్పారు. కానీ అప్పటి నుంచే ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు.

ఆగస్టు వరకు వర్షాపాతం తక్కువగా నమోదైతే పక్క రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయని… కరువు మండలాలను ప్రకటించి నివేదికలు కేంద్రానికి ఇచ్చాయని, కావాల్సిన చర్యలు చేపట్టాయని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత కరువు పరిస్థితులు వేరే రాష్ట్రాల్లో లేవని అన్నారు. దొంగల పడ్డ ఆరునెలలకు ఇప్పుడు వచ్చి రైతులు పంట వేయకుండా త్యాగాలు చేయాలంటున్నారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 30 నెలలు గడిచిపోయిందని… ఇప్పటి వరకు పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేయలేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను రిపేర్ చేయకుండా… ఇంకా ఎన్ని రోజులు పాత ప్రభుత్వాన్ని నిందిస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మీద శ్రద్ధ లేకపోవటం కారణంగా రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button