
హాస్టల్ బాత్రూంలో యువతి ప్రసవం.. కిటికీలోనుంచి విసిరేయడంతో శిశువు మృతి
web desc : కొంతమంది ఏ మాత్రం మానవత్వం లేకుండా చేసే కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చినపుడు సమాజం మొత్తం ఉలిక్కిపడుతోంది. అప్పుడే పుట్టిన శిశువు కళ్లు కూడా తెరవకముందే.. ప్రాణాలు తీయడం అంటే ఎంత కర్కశత్వం. ఆ పని చేసింది కూడా ఆ బిడ్డను కన్న తల్లే అంటే.. ఆమెను కన్నతల్లి కాదు మానవ మృగమే అని పిలవచ్చు.
క్షణకాలం సుఖం కోసం తప్పులు చేసి.. ఆ తప్పు కారణంగా పుట్టిన బిడ్డలను పుట్టగానే కడతేర్చుతున్న తల్లులు ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. ఎవరికీ తెలియకుండా వెంటిలేటర్ నుంచి బయటకు విసిరి.. ఆ చిన్నారి ప్రాణాలను చిదిమేసింది.
హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ కలిచి వేస్తోంది. అప్పుడే పుట్టి కళ్లు కూడా సరిగ్గా తెలియని ఆ అభం శుభం తెలియని పసికందు.. లోకాన్ని చూడకముందే.. ఆ తల్లి కాటికి పంపించింది. కనీస మానవత్వం కూడా లేకుండా బయటికి విసిరేసింది. స్థానికంగా ఉన్న ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఓ యువతి తాజాగా ఆ హాస్టల్ వాష్‌రూమ్‌లో ప్రసవించింది. ఆ తర్వాత అక్కడే ఉన్న వెంటిలేటర్ నుంచి ఆ నవజాత శిశువును విసిరేయడంతో ప్రాణాలు కోల్పోయింది.
ఇక హాస్టల్ బాత్రూంలో ప్రసవించిన ఆ యువతి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో అది గమనించి హాస్టల్ యాజమాన్యం ఆమెను నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు హాస్టల్ సిబ్బంది అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆ యువతి గర్భం దాల్చిన విషయం ఆ హాస్టల్ సిబ్బందికి కూడా తెలియకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇక జరిగిన విషయం మొత్తం ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ యువతి తన బావ కారణంగానే గర్భం దాల్చి ఉండవచ్చని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఆ యువతి కోలుకుని వివరాలు చెబితే.. ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.




