
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
సికింద్రాబాద్లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఓ ఎస్ఐ. గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహులు ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు.
స్టేషన్ బెయిల్ , ఫ్యూచర్ లో ఎలాంటి కేసు పెట్టకుండా ఉండేందుకు బాధితుడి నుంచి ఏకంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ నర్సింహులు. అందులో భాగంగా.. బాధితుడి నుంచి మొదటి విడతగా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు.
ప్రస్తుతం గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నర్సింహులుకు సంబంధించిన పూర్తి రికార్డులను పరిశీలిస్తున్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే.. ఇలా లంచం తీసుకుంటూ దొరికిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.




