HealthHyderabadNotificationPoliticalTelangana

TIMSలో 122 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. నిమ్స్ నోటిఫికేషన్ విడుదల

TIMSలో 122 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. నిమ్స్ నోటిఫికేషన్ విడుదల

TIMSలో 122 కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. నిమ్స్ నోటిఫికేషన్ విడుదల

web desc : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆధ్వర్యంలో సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS)లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సాంకేతిక, పరిపాలనా, సహాయక విభాగాల్లో మొత్తం 122 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

తెలంగాణకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు లేదా రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని నిమ్స్ పేర్కొంది.

నోటిఫికేషన్ ప్రకారం టెక్నికల్ విభాగంలో 98 పోస్టులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 24 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2కు 34 పోస్టులు, అనస్థీషియా టెక్నీషియన్‌కు 20 పోస్టులు, ఎక్స్‌రే/సీ-ఆర్మ్ టెక్నీషియన్ గ్రేడ్-2కు 10 పోస్టులు,

ఈసీజీ, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్‌లకు చెరో 6 పోస్టులు, బ్లడ్ బ్యాంక్, సీటీ, ఎంఆర్ఐ, సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్‌లకు చెరో 4 పోస్టులు కేటాయించారు. అలాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌కు 5 పోస్టులు, సూపర్‌వైజర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు చెరో 4 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు, అనుభవం, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లోని అనెక్సర్-1లో పొందుపరిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button