PoliticalTelanganaYadadri

వివాహిత మృ*తి.. మల్లారెడ్డి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన

వివాహిత మృ*తి.. మల్లారెడ్డి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన

వివాహిత మృ*తి.. మల్లారెడ్డి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో వివాహిత మృతి ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు.
గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన శిగ లక్ష్మణ్-స్వరూప (36) దంపతులు కిరాణా, జనరల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన నాగం మల్లారెడ్డితో స్వరూపకు గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుమారు 15 రోజుల క్రితం ఆమె మల్లారెడ్డితో కలిసి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లారెడ్డి స్వరూపను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాడు.అయితే, కొద్ది రోజులకే స్వరూప మళ్లీ మల్లారెడ్డితో కలిసి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.

ఈ నెల 18న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి ఆమెను గుండాల మండలం అంబాల గ్రామంలోని బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి భర్త లక్ష్మణ్ అక్కడికి వెళ్లి భార్యతో మాట్లాడి తిరిగి ఆత్మకూరుకు వచ్చాడు. మరుసటి రోజు స్వరూపను ఇంటికి తీసుకురావడానికి వెళ్లగా, ఆమె ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు.

వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, ఈ నెల 23న చికిత్స పొందుతూ మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం గురువారం మృతదేహాన్ని ఆత్మకూరుకు తీసుకొచ్చారు. స్వరూప మృతికి నాగం మల్లారెడ్డే కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

మృతదేహాన్ని మల్లారెడ్డి ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు అంబులెన్స్‌ను గ్రామానికి కిలోమీటరు దూరంలో నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అంబులెన్స్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పోలీసుల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం మృతదేహాన్ని నాగం మల్లారెడ్డి ఇంటి ముందు ఉంచి ఆందోళన కొనసాగించారు.

చౌటుప్పల్ ఏసీపీ పి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు మూడు గంటల పాటు ఆందోళన కొనసాగడంతో రహదారిపై ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, మల్లారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button