
ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి.. వివాదంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్
Web desc : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నాడు. సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక నటుడు, ఆర్డర్ మార్చి తెచ్చాడనే చిన్న కారణంతో ఫుడ్ డెలివరీ బాయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అతడిపై భౌతికంగా దాడికి దిగడం టాలీవుడ్లో సంచలనంగా మారింది.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం ఒకే ఒక్క సినిమాతో కాస్త క్రేజ్ రాగానే తోటి మనుషులపై ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తారా అంటూ చిత్ర పరిశ్రమతో పాటు సాధారణ ప్రజలు సైతం ఈ యువ నటుడి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హీరో అఖిల్ రాజ్ ఆన్లైన్ ద్వారా ఒక యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే సదరు ఫుడ్ డెలివరీ బాయ్ పని ఒత్తిడిలో పొరపాటున అఖిల్ రాజ్ ఆర్డర్‌కు బదులుగా మరొకరి పార్సిల్‌ను అతనికి డెలివరీ చేశాడు.
ఈ చిన్న పొరపాటును గమనించిన హీరో తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురయ్యాడు. విషయాన్ని గుర్తించిన డెలివరీ బాయ్ వెంటనే నమస్కరిస్తూ, తన వల్ల తప్పు జరిగిందని క్షమించమని వేడుకున్నాడు. అయినప్పటికీ అఖిల్ రాజ్ ఏమాత్రం శాంతించకుండా సదరు యువకుడిపై బూతులతో రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న అఖిల్ రాజ్ తల్లిదండ్రులు అతనిని శాంతింపజేయడానికి, వెనక్కి లాగడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఆ నటుడు వారి మాటలను కూడా లెక్కచేయకుండా బిల్డింగ్ మెట్లపై నుంచి డెలివరీ బాయ్ వైపు దూసుకువెళ్లి అతనిపై చేతులెత్తడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
మరోవైపు ఈ దాడికి గురైన బాధితుడు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్నాడు. తాను పొరపాటును ఒప్పుకుని, క్షమాపణలు కోరినప్పటికీ ఏమాత్రం మానవత్వం లేకుండా హీరో తనను దూషిస్తూ కొట్టడానికి వచ్చాడని కన్నీరు పెట్టుకున్నాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అఖిల్ రాజ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కొద్దిపాటి స్టార్డమ్ తలకెెక్కి ఇలా శ్రమజీవులను హింసించడం తగదని హితవు పలుకుతున్నారు. సినిమా రంగంలో మరింత ఎదగాల్సిన ఇలాంటి యంగ్ హీరోలు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలని మండిపడుతున్నారు. ఈ తీవ్రమైన వివాదం మరియు నెటిజన్ల ట్రోలింగ్‌పై హీరో అఖిల్ రాజ్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.




