AdilabadPoliticalTelangana

నార్కోటిక్ జాగిలం "రోమా" సహాయంతో గంజాయి స్వాధీనం

నార్కోటిక్ జాగిలం "రోమా" సహాయంతో గంజాయి స్వాధీనం

నార్కోటిక్ జాగిలం “రోమా” సహాయంతో గంజాయి స్వాధీనం

ఆదిలాబాద్ పట్టణంలో 39 గ్రాముల గంజాయి పట్టివేత

నిందితుడు గోడెం ఆకాశ్‌పై కేసు నమోదు

మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయి

ఆదిలాబాద్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా, గంజాయి రహిత జిల్లాగా నిర్మించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలో సిసిఎస్ బృందం మరియు నార్కోటిక్ జాగిలం “రోమా” సహాయంతో అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా జాగిలం రోమా వాసన ద్వారా అనుమానాస్పద ప్రదేశాన్ని గుర్తించగా, నిందితుడు గోడెం ఆకాశ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో 13 ప్యాకెట్లలో సుమారు 39 గ్రాముల గంజాయి లభ్యమవడంతో వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై గంజాయి కేసు నమోదు నమోదు చేయడం జరిగింది. యువత మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, నిల్వ, వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్-100 లేదా 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్సై రాజశేఖర్ రెడ్డి, నార్కోటిక్ జాగిలం హ్యాండ్లర్ రమేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button