HyderabadPoliticalTelangana

గూడ్స్‌ రైలు ఎక్కి ..హైటెన్షన్ వైర్లు పట్టుకున్న యువకుడు..

గూడ్స్‌ రైలు ఎక్కి ..హైటెన్షన్ వైర్లు పట్టుకున్న యువకుడు..

గూడ్స్‌ రైలు ఎక్కి ..హైటెన్షన్ వైర్లు పట్టుకున్న యువకుడు..

ఫలక్‌నుమా రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ రైలు పైకెక్కి ఓ యువకుడు హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలను పట్టుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.

వరంగల్‌ జిల్లా భూపాలపల్లికి చెందిన కేసరి పవన్‌(23) మల్కాజిగిరి నుంచి గూడ్స్‌ రైలులో శనివారం అర్ధరాత్రి ఫలక్‌నుమాకు వచ్చి అక్కడ రైలు పైకి ఎక్కాడు.ఒక్కసారిగా హైటెన్షన్​ విద్యుత్​ తీగలను పట్టుకున్నాడు.

వెంటనే అధికారులు విద్యుత్​ నిలిపివేసి అతడిని కిందికి దించారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button