
జాతీయ రహదారిపై అక్రమ పార్కింగ్‌కు పాల్పడిన ముగ్గురిపై కేసు
హైవేపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఇచ్చోడా సీఐ సీహెచ్ రమేష్
రోడ్డు భద్రతకు భంగం కలిగించిన వీరిపై సుమోటో కేసు నమోదు
జూలై 4వ తేదీ ఉదయం సుమారు 9 గంటల సమయంలో హైవే పెట్రోలింగ్ సిబ్బంది జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తుండగా, గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా వాహనాలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే విధంగా వ్యవహరిస్తున్న ముగ్గురిపై సుమోటో కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడా సీఐ సీహెచ్ రమేష్ తెలిపారు.
అరెస్టు చేసిన వారిలో
విజయ్ పాటిల్ (తండ్రి: రాంజీ) – టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు,
సర్పే సుమిత్ (తండ్రి: ఆనందరావు) – శ్యామ్ మొబైల్ టిఫిన్స్ నిర్వాహకుడు,
సర్పే విలాస్ (తండ్రి: మల్లేష్) – జై శ్రీరామ్ టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారని తెలిపారు.
వ్యాపార అవసరాల పేరుతో జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం, ట్రాఫిక్‌కు ఆటంకం కల్పించడం, ప్రమాదాలకు దారి తీసేలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని సీఐ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా రహదారులపై అక్రమ పార్కింగ్ చేసే వారిపై ఇలాంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ ఎస్సై ఎల్. శ్రీకాంత్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




