
వృద్ధురాలిపై లైంగికదాడికి యత్నించిన కౌన్సిలర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు గ్రామంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఓ వార్డు కౌన్సిలర్‌పై వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం.. చాగల్లు పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ సంపత్ రాజ్ అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించినట్లు ఆరోపించారు.
నిద్రిస్తున్న సమయంలో ఆమెపై దాడికి యత్నించగా, భయాందోళనకు గురైన వృద్ధురాలు గట్టిగా కేకలు వేసినట్లు తెలిపారు.ఆమె అరుపులు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన కౌన్సిలర్ సమీపంలోని బాత్రూమ్లోకి వెళ్లి తలుపు వేసుకున్నట్లు సమాచారం.
దీంతో స్థానికులు బాత్రూమ్కు బయట నుంచి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్టేషన్ ఘన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడిపై నమోదైన కేసు వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికానున్నాయి.




