
రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన మున్సిపల్ ఏఈ
పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైడ్స్ ప్రకంపనలు సృష్టించాయి. మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న ఏఈ (AE) సతీష్ ఏసీబీ అధికారులకు చిక్కారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..మున్సిపల్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసేందుకు, ఏఈ సతీష్ రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు బత్తుల శ్రీనివాస్ నుండి డబ్బులు తీసుకుంటున్న సమయంలో, ఏసీబీ అధికారులు అదును చూసి మెరుపు దాడి చేశారు. దీంతో ఏఈ సతీష్ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. అవినీతి నిరోధక శాఖ జెడి (JD) ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఇలాగే దొరికిపోతారని చెప్పకనే చెబుతోంది ఈ ఘటన. ప్రస్తుతం ఏఈ సతీష్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.




