NationalNotificationPolitical

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

Web desc : బ్యాంకింగ్‌ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (IBPS) నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) పోస్టుల ఖాళీల సంఖ్య పెరిగింది. దీంతో ఐబీపీఎస్‌ మొత్తం పోస్టుల సంఖ్యను 8,400కు పెంచింది.

జులై 1న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌ (PO), మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (MT) పోస్టుల సంఖ్య మొదట 6,715గా ప్రకటించారు. తాజాగా ఇండియన్‌ బ్యాంక్‌లో 650 ఖాళీలను అదనంగా చేర్చడంతో మొత్తం PO/MT పోస్టుల సంఖ్య 7,365కు పెరిగింది. మొదట ప్రకటించిన 745 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ (SO) పోస్టులకు అదనంగా 290 పోస్టులను చేర్చడంతో మొత్తం SO ఖాళీల సంఖ్య 1,035కు చేరింది.

దీంతో మొత్తం పోస్టులు 8,400కు పెరిగాయి. అయితే యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాళీల వివరాలను ఇంకా ప్రకటించలేదు. భవిష్యత్తులో ఈ బ్యాంకుల ఖాళీలు కూడా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్యాంకుల వారీగా IBPS PO పోస్టుల వివరాలు..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పోస్టుల సంఖ్య: 1,900
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టుల సంఖ్య: 500
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 1,100
కెనరా బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 1,500

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పోస్టుల సంఖ్య: 500
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 550
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 504
పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 161
ఇండియన్‌ బ్యాంక్‌లో పోస్టుల సంఖ్య: 650
ఐబీపీఎస్‌ PO/MT, SO పోస్టులకు దరఖాస్తు గడువు కూడా పొడిగించారు. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 21తో ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

తాజాగా ఈ గడువును జులై 26, 2026 వరకు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఐబీపీఎస్‌ ఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌ రాత పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. ఇక మెయిన్‌ పరీక్షలు అక్టోబర్‌/నవంబర్‌లో జరగనున్నాయి.

ప్రిలిమ్స్‌ పరీక్షకు సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ ప్రారంభించడం మంచిది. బ్యాంకింగ్‌ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు IBPS PO, MT, SO నియామకాలు మంచి అవకాశంగా మారాయి. ఖాళీల సంఖ్య పెరగడంతో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, సరైన ప్రణాళికతో సిద్ధమైతే ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button