KhammamPoliticalTelangana

ఖమ్మంలో ఢాడి లంబాడీల స్మశాన వాటిక పరిరక్షించాలని మంత్రి పొంగులేటికి వినతి

ఖమ్మంలో ఢాడి లంబాడీల స్మశాన వాటిక పరిరక్షించాలని మంత్రి పొంగులేటికి వినతి


ఖమ్మంలో ఢాడి లంబాడీల స్మశాన వాటిక పరిరక్షించాలని మంత్రి పొంగులేటికి వినతి

ఆగస్టు 02 ఖమ్మం: ఖమ్మంలో సుమారు 150 సంవత్సరాల నుండి నగరం నడిబొడ్డున ఉన్న ఢాడి లంబాడీల స్మశాన వాటికను పరిరక్షించాలని ఢాడి లంబాడీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి డుంగ్రోతు శేఖర్ కోరారు. ఢాడి లంబాడీల స్మశాన వాటిక ఉన్న ప్రాంతంలో మున్నేరు వాగు రిటర్నింగ్ వాల్ నిర్మించడానికి ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తున్నారని. ప్రజా ప్రయోజనాల కోసం నిర్మాణం చేపట్టే రిటర్నింగ్ వాల్ కు వ్యతిరేకం కాదని అదే ప్రదేశంలో ఉన్న ఢాడి లంబాడీల స్మశాన వాటికను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఢాడి లంబాడీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి (డి.ఎల్.హెచ్.ఎస్.ఎస్ ) రాష్ట్ర కార్యదర్శి శేఖర్ నాయక్ మాట్లాడుతూ. ఖమ్మం నగరంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం సర్వే చేస్తున్న ప్రాంతాన్ని ఢాడి సమాజ యువకులు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, అందరు కలిసి వెళ్లి పరిశీలించడం జరిగిందని. తమ పూర్వీకుల స్మశాన వాటిక ఈ విధంగా కూల్చివేస్తే రాబోయే తరానికి మేంఏం జవాబు ఇస్తామని సంబంధిత అధికారులకు ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి (డి.ఎల్.హెచ్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఎవరు కూడా పట్టించుకునే నాధుడు లేడని, పట్టు వదలని విక్రమార్కుల ఢాడి లంబాడి యువకుల సైన్యం వెనకడుగు వెయ్యకుండా జిల్లా కలెక్టర్ కి, ఆర్డిఓకి, ఎంఆర్ఓకి, సంబంధిత అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. అధికారులు హామీ ఇచ్చిన తర్వాత కూడా ముగ్గురు జిల్లా కలెక్టర్లు బదిలీ కావడం జరిగిందని తెలిపారు. ముగ్గురు సంబంధిత మండల ఎమ్మార్వోలు తహసీల్దారులు బదిలీ కావడం. అయినా ఉద్యమం ఆగలేదని ఏ అధికారి రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడంతో ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి (డి.ఎల్.హెచ్.ఎస్.ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ ఆశ్రయించడంతో జాతీయ ఎస్టీ కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయడంతో హుటాహుటిన పని ఆపేసి పట్టణంలోనే వేరే దగ్గర భూమి కేటాయిస్తామని ఎస్టీ కమిషన్ కు సమర్పించిన నివేదికలో తెలపనైనదన్నారు. కానీ ఖమ్మం పట్టణంలో ఉన్న రాజకీయ నాయకుల వల్ల ఆ భూమి కేటాయించడంలో జాప్యం జరిగింది. కొంత భాగము స్మశాన వాటిక పోయిన తర్వాత ఇప్పుడు జిల్లా అధికారులు వేరే దగ్గర ఖమ్మం పోలేపల్లి రెవెన్యూ విలేజ్ యందు సర్వే నంబర్ విస్తీర్ణము సర్వే నంబర్ 152/1/p and 153/1/p విస్తీర్ణము 2.00 ఎకరాల భూమి ఢాడి లంబాడీల స్మశాన వాటిక కొరకై రెండు ఎకరాల పైన భూమి కేటాయించి సర్వే చేసి హద్దులు కూడా చేయించారని తెలిపారు. స్మశాన వాటిక భూమి కేటాయింపు కోసం ఉద్యమంలో మాకు వెన్నంటు ఉండి వారి అపారమైన సూచనలు, సలహాలు ఇచ్చిన ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి (డి.హెచ్.ఎల్.ఎస్.ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు రుడావత్ రఘు నాయక్ కి మరియు స్మశాన వాటిక భూమి కేటాయించడంలో సహకరించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఢాడి లంబాడీల స్మశాన వాటికకు కేటాయించి భూమికి స్మశాన వాటిక అభివృద్ధికి చుట్టూ ప్రహరీ గోడ మరియు విద్యుత్ మరియు నీటి వసతి కల్పించాలని దానికై బడ్జెట్లో (నిధులు) కేటాయించాలని వినతి పత్రంలో కోరనైందని తెలియజేశారు. అందుకు మంత్రి పొంగులేటి స్పందించి తక్షణమే మున్సిపల్ కమిషనర్ కి ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢాడి లంబాడి హక్కుల సాధన సమితి ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు దేవత్ కాళిదాస్. కార్యదర్శి. రత్నావత్ దినేష్ కుమార్. కోశాధికారి. రత్నావత్ ఉపేందర్. రాష్ట్ర నాయకులు. డోన్మాన్ వెంకట్రావు. రాష్ట్ర నాయకులు. డుంగ్రోత్. మణికంఠ. సహాయ కార్యదర్శి. దేవత్ ప్రసాద్. జిల్లా కార్యవర్గ సభ్యులు. డుంగురోతు. విక్కీ. రత్నావత్. సంతోష్ కుమార్. డోన్ వన్ దుర్గ. దేవత్ విజయ్. డుంగ్రోత్ దాసు. డోన్మాన్ వినయ్. డుంగ్రోత్ వీరబాబు. ఆర్. జయ. సలహాదారుడు. డోన్ వన్ టోపీ శీను. జె. శేఖర్. దేవత్ అంకుష్. డోంగ్రోత్ జాను. డోన్ వన్ శీను. డోంగ్రోత్ బొచ్చు శీను.. డొంగురోతు రాంబాబు. తాజ్మత్ వెంకట్. రత్నావత్ వెంకన్న. డోంగ్రోత్ నాగరాజు. రత్నావత్ బాబు. దేవత రవికుమార్. వికలాంగుల జిల్లా నాయకులు. డోన్మాన్ నాగరాజు. డోంగ్రోత్. తొండ సాయి వెంకట్. డోన్మాన్. బొక్కో జయరాం.. డోన్మాన్ గణేష్. డొంగురోతు. సుశీల్. డోంగ్రోట్. శ్యామ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button