
మందు ఉచితంగా ఇవ్వలేదని.. వైన్ షాప్ పై దాడి
Web desc : మందు తాగి గొడవపడే వాళ్ళను చూశాం… ముందుకు డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోవాళ్లను కొట్టే తాగుబోతులను కూడా చూశాం కానీ… వైన్ షాప్ మీదనే దాడికి దిగినోళ్ళను చూశారా ఎప్పుడైనా. అది కూడా మందు ఉచితంగా ఇవ్వలేదని వైన్ షాప్ మీద దాడి చేశారు మద్యం ప్రియులు. పెద్దపల్లి జరిగింది ఈ ఘటన. ఆదివారం ( ఆగస్టు 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
పెద్దపల్లిలో వైన్ షాప్ పై దాడికి దిగారు మద్యం ప్రియులు. మద్యం ఉచితంగా ఇవ్వలేదని వైన్షాప్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. వైన్ షాప్ గ్రిల్, ఫ్యాన్లు, మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు.
వైన్స్ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు మద్యం ప్రియులు. ఈ ఘటనలో షాప్ కు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు షాపు నిర్వాహకులు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైన్స్ నిర్వాహకులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.




