
డిఫెన్స్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. సికింద్రాబాద్లో పోస్టులు.. వివరాలు ఇవే !
web desc : రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (డీజీక్యూఏ) వివిధ విభాగాల్లో 14 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు పేరు: గ్రూప్-సి. మొత్తం ఖాళీలు: 14.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ (స్కిల్డ్)- సికింద్రాబాద్ 4 (జనరల్-3, ఓబీసీ-1), టెక్నీషియన్ ( సెమీ స్కిల్డ్) – బెంగళూరు 4 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్టీ-1) టెక్నీషియన్- (స్కిల్డ్)- 2 (జనరల్), టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) – జబల్పూర్ 1 (జనరల్), టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్) – చండీగఢ్- 2 (జనరల్ 1, ఓబీసీ 1), టెక్నీషియన్ స్కిల్డ్-ఎస్సీ-009/1 – సికింద్రాబాద్ 1.
ఎలిజిబిలిటీ : టెక్నీషియన్ (స్కిల్డ్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి. నిర్దిష్ట ట్రేడ్లో ఐటీఐ లేదా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సమాన డిఫెన్స్ సర్వీసెస్ ట్రేడ్స్మన్ కోర్స్ పూర్తిచేసి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ లేదా అండర్టేకింగ్ నుంచి సంబంధిత ట్రేడ్లో కనీసం ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి.
టెక్నీషియన్ (సెమీ స్కిల్డ్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఏదైనా ట్రేడ్లో ఐటీఐ లేదా కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సమాన డిఫెన్స్ సర్వీసెస్ ట్రేడ్స్మన్ కోర్స్ పూర్తిచేసి ఉండాలి. వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.అడ్రస్ : కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (సిస్టమ్స్), డీజీక్యూఏ టెక్నికల్ కాంప్లెక్స్, మనోవికాస్ నగర్ పోస్ట్ ఆఫీస్, సికింద్రాబాద్ – 500009 చిరునామాకు పంపించాలి. అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 8. లాస్ట్ డేట్: ఆగస్టు 28. సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.




