Andhra PradeshPolitical

మహిళా హెడ్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై చం*పిన భర్త...

మహిళా హెడ్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై చం*పిన భర్త...

మహిళా హెడ్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై చం*పిన భర్త…

చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ తామరై సెల్విపై ఆమె భర్త అరవింద్ నడిరోడ్డుపైనే కత్తితో కిరాతకంగా దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ సెల్వి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దాడి సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో భర్త అరవింద్‌కు కూడా గాయాలయ్యాయి.

ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అరవింద్.. కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు అరవింద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button