PoliticalTelangana

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కాలని ప్రత్యేక పూజలు

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి

-కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కాలని ప్రత్యేక పూజలు

మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

సి కె న్యూస్ చౌటుప్పల్ మండల ప్రతినిధి (శ్రీనివాస్) డిసెంబర్ 4

మునుగోడు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు.

చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని రామాలయంలో మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచుకొని ఘనంగా విజయోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించుకున్నారు.

ఈ సందర్భంగా వెన్ రెడ్డి రాజు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి చారిత్రకమైన తీర్పునిచ్చారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించే నాయకుడు అని అన్నారు.

అటువంటి వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఉబ్బువరమ్మ వెంకటయ్య, అంతటి విజయలక్ష్మి బాలరాజు,

కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ సైదులు గౌడ్, సందగళ్ళ విజయ సతీష్, కామీశెట్టి శైలజ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు బొబ్బిళ్ళ మురళి, మొగుదాల రమేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button