
కూకట్‌పల్లి ఓయో హోటళ్లలో వ్యభిచారం
web desc : కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి బుధవారం విలేకరులకు వెల్లడించారు.
భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లో ఉన్న సాయి ప్యారడైజ్, వైసాయి కాటేజ్ ఓయో హోటళ్లలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో సీఐ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం రాత్రి ఈ దాడులు చేపట్టారు.
ఈ ఘటనలో నిర్వాహకులు ఆమని (28), దినేష్ (21), రాజేష్ (28), ఉమేష్ చంద్ర (24), రామసాయి (25), విటులు రాజు (26), బాలరాజు (27), వంశీ (38) ప్రశాంత్ (36)లను అరెస్టు చేశారు. ముగ్గురు బాధితురాళ్లను రెస్క్యూ హోంకు తరలించారు.
మరో ఇద్దరు నిర్వాహకులు పరారీలో ఉన్నారు. హోటళ్ల అనుమతులు రద్దు చేసి సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీపీ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని అల్లూరి ట్రేడ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో రెండు వేరు వేరు లాడ్జిలలో కూకట్ పల్లి పోలీసులు దాడులు నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కెపిహెచ్బి మెట్రో స్టేషన్ కు సమీపంలో అల్లూరి ట్రేడ్ సెంటర్ కాంప్లెక్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని అందిన సమాచారంతో మంగళవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
అల్లూరి ట్రేడ్ సెంటర్‌లోని మూడవ అంతస్తులో గల వైశాయి కాటేజ్, నాలుగవ అంతస్తులోని సాయి పేరడైజ్ లో వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపారు. దాడుల్లో భాగంగా లాడ్జిలలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఐదుగురు నిర్వాహకులను, నలుగురు విటులను, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
నిర్వాహకులలో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అల్లూరి ట్రేడ్ సెంటర్‌లోని లాడ్జిల నిర్వాహకులు వ్యభిచార కార్యక్రమల కోసమే ఈ లాడ్జిలను లీజ్‌కు తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ లాడ్జిల నిర్వహణ కోసం అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
గత కొంతకాలంగా కెపిహెచ్బి మెట్రో స్టేషన్‌కి సమీపంలో వ్యభిచార కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది, వాటిని నిరోధించడంలో భాగంగా అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినయెడల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ లో కూకట్పల్లి ఇన్‌స్పెక్టర్ స్వామి గౌడ్, ఎస్సైలు చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, స్రవంతి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




