
భారత రాజ్యాంగ నిర్మాత ,సంఘసంస్కర్త భారతరత్న డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్
డాక్టర్. చీమ. శ్రీనివాస్ రావు.
మేడ్చల్ : అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత ,సంఘసంస్కర్త భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈ. సి. ఐ.ఎల్.ఆయనకు ఘన నివాళులు అర్పించారు అంటరానితనంతో కులవివక్షకు గురై ఉన్నత విద్యా చదివి, దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ మనందరికీ ఆదర్శప్రాయులని పేర్కొన్నారు.
ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తుంది అంటే కారణం అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగమేమన్నారు సమాన అవకాశాలు ,హక్కులు అందించి ప్రతీ పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయుడికి మనమిచ్చే ఘన నివ్వాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్, దొమ్మటి కిరణ్ కుమార్ రావు,కీర్తి శ్రీనివాస్,అనంతలక్ష్మి,శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.



