
ఒక్కటైనా ప్రేమ జంట.. ఆనందం వ్యక్తం చేస్తున్న శిరీష,కుటుంబ సభ్యులు..
web desc : జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏకలవ్యనగర్కు చెందిన యువతి, యువకుడి మధ్య ఆరేళ్లుగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం ఇటీవల వివాదంగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ అంగడి శిరీష ఆదివారం తన ప్రియుడు సతీష్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
తనను పెళ్లి చేసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని శిరీష స్పష్టం చేసింది. ఈ ఘటనపై ‘దిశ’తో పాటు పలు మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో సతీష్ పెళ్లికి అంగీకరించాడు. దీంతో స్థానిక సాయిబాబా ఆలయంలో కుల పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో శిరీష, సతీష్ వివాహం జరిగింది.
దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. తమ సమస్యకు పరిష్కారం లభించడంలో మీడియా కథనాలు కీలకంగా నిలిచాయని పేర్కొంటూ ఇరు కుటుంబాల సభ్యులు ఈ వార్తను ప్రచురించిన ఇతర మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.




