HealthPoliticalSiddipetaTelangana

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి అంటూ బంధువుల ఆందోళన

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి అంటూ బంధువుల ఆందోళన

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి అంటూ బంధువుల ఆందోళన

web desc : వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మృతుడు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామానికి చెందిన సంద రాములు (54) ఊపిరితిత్తులు, కాలేయం ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతుండటంతో ఈనెల 21వ తేదీన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోని వచ్చారు.

మధ్యాహ్నం ఒకటి గంటలకు పేషంటును కుటుంబ సభ్యులు తీసుకువస్తే బెడ్ లేదని రాత్రి 7 గంటల వరకు వెయిట్ చేయించి అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న ఒకరోజు తర్వాత సందే రాములు ఆరోగ్యంగా కోలుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఐసీయూ లో ఎదురుగా బెడ్ మీద ఉన్న పేషెంట్ చనిపోవడంతో డాక్టర్లు అక్కడ ఉన్న అందరి పేషంట్ల ముందు సీపీఆర్ చేశారు.

సిబ్బందితో వాగ్వాదం.. అయిన లాభం లేకుండ పోయింది. అది చూసిన రాములు భయాందోళనకు గురయ్యాడు. ఛాతీ లో నొప్పి వస్తుందని తన కుటుంబ సభ్యులు చెప్పడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కి డ్యూటీ డాక్టర్ కు చెప్పారు. కుటుంబ సభ్యులను ఐసీయూ లోనికి రానివ్వకుండా, పేషెంట్ కండిషన్ చెప్పకుండా వ్యవహరించారని తెలిపారు. వైద్యం అందకపోవడంతో సంద రాములు మృతి చెందనట్లు బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఐసియూ లోని డాక్టర్ల, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసిపి రవీందర్ రెడ్డి, వన్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ మురళి, పోలీస్ సిబ్బందితో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన విరమించాలని సూచించారు. రాములు మృతికి కారణమైన డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేస్తేనే ఆసుపత్రి నుండి మృతదేహాన్ని తీసుకువెళ్తామని ఆందోళన చేశారు. చివరకు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button