
తొర్రూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
సి కే న్యూస్,తొర్రూరు : అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతుందని, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కూడా సులభతరం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు పొందని కుటుంబాలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమా రజిని రాజశేఖర్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యురాలు పంజా కల్పన, వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




