
స్పా సెంటర్ పై పోలీసుల దాడి… ముగ్గురి అరెస్టు
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మిథాలీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో స్పా నిర్వాహకుడు షేక్ ముస్తాక్ అహ్మద్(41), మేనేజర్ షేక్ పైసలుద్దీన్(21), ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు మహిళలను బాధితులుగా గుర్తించి రక్షించారు.
విచారణలో ముస్తాక్ అహ్మద్ రెండు నెలలుగా అపార్ట్మెంట్లోని ప్లాట్‌ను అద్దెకు తీసుకుని స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




