BhadrachalamPoliticalTelangana

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా... పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా... పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా… పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం

Web desc : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి,గర్భవతిని చేసి మోసగించాడంటూ ఓ యువతి బాధితురాలిగా మారి ప్రియుడి ఇంటి ముందు న్యాయం కోసం నిలదీసిన ఘటన బుధవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తీవ్ర కలకలం రేపింది.

​ వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని మొరంపల్లిబంజర గ్రామానికి చెందిన ధారా శివాని (26) ప్రైవేట్ నర్సుగా పనిచేస్తోంది. బూర్గంపాడు ఎస్సీ కాలనీకి చెందిన తోకల సాయి (28) అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. సాయి ప్రస్తుతం ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో, సాయి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. ఢిల్లీకి తీసుకెళ్లి గర్భవతిని చేసి.. పెళ్లి పేరుతో శారీరకంగా దగ్గరై తనను గర్భవతిని చేశాడని, ఆ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి ఆసుపత్రుల చుట్టూ తిప్పాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

తీరా సొంత ఊరికి వచ్చాక తనకు,ఆమెకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ మొహం చాటేశాడని వాపోయింది. దీంతో న్యాయం కోసం బాధితురాలు బూర్గంపాడులోని సాయి ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను, సాయిని నిలదీసింది. ​ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత

న్యాయం కోసం బాధితురాలు నిలదీయడంతో కాలనీలో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన జీవితాన్ని నాశనం చేసిన సాయిపై చర్యలు తీసుకుని,తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె కన్నీరుమున్నీరవుతూ డిమాండ్ చేసింది. కాగా ఈ వ్యవహారం బూర్గంపాడు పోలీస్ స్టేషనుకు చేరినట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button