
లచ్చగూడెంలో డీజే సీజ్..
ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎస్ ఐ జి నరేష్.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
సెప్టెంబర్ 13 చింతకాని మండల పరిధిలోని లచ్చగూడెం గ్రామంలో అదివారం రాత్రి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డీజే సౌండ్‌పై చింతకాని ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి డీజీ ని సీజ్ చేశారు.డీజే నిర్వాహకులు గోగుల నాగరాజు,గంగుంట్ల రాము అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.మండలంలో డీజే నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని పోలీసులు తెలిపారు.అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చింతకాని ఎస్ ఐ జి నరేష్ హెచ్చరించారు.ఇటీవల కాలంలో డీజే సౌండ్స్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లచ్చగూడెం గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఎస్ ఐ నరేష్ దృష్టికి తీసుకొచ్చారు ఇట్టి చర్యలో భాగంగా డీజే సౌండ్స్ ను చెక్ పెట్టే విధంగా చర్యలు చేపడుతుండటంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




