HyderabadPoliticalTelangana

ఆరు నెలల పాపతో తల్లి అదృశ్యం !

ఆరు నెలల పాపతో తల్లి అదృశ్యం !

ఆరు నెలల పాపతో తల్లి అదృశ్యం !

కొత్తూరులో కలకలం ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

,షాద్ నగర్ నియోజకవర్గ కొత్తూర్ సికె న్యూస్ ప్రతినిధి,సెప్టెంబర్ 22:

కొత్తూరు మండలం శేరిగూడ గ్రామానికి చెందిన దండు మాధవి (23) తన ఆరు నెలల చిన్నారి శైలజతో కలిసి అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది తల్లి చిన్నారి ఆచూకీ కోసం కొత్తూరు పోలీసులు గాలింపు చేపట్టారు కొత్తూరు సీఐ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం దండు మాధవి తన భర్త దండు బాలరాజ్ రోజువారీ కూలీ పనులకు వెళ్లిన సమయంలో చిన్నారి శైలజను వెంట తీసుకుని గ్రామంలో కొత్తూరు పట్టణంలోని ఇళ్ల వద్దకు వెళ్లి అన్నం డబ్బులు అడుక్కుని తిరిగి ఇంటికి వచ్చేది ఈ క్రమంలో సెప్టెంబర్ 18న ఉదయం 9 గంటల సమయంలో ఆరు నెలల పాపను వెంట తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాధవి తిరిగి ఇంటికి రాలేదు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు దీంతో మాధవి భర్త సెప్టెంబర్ 20న కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలి

తల్లి దండు మాధవి ఆరు నెలల చిన్నారి శైలజ ఎక్కడైనా కనిపించినా వారి ఆచూకీ గురించి సమాచారం తెలిసినా వెంటనే కొత్తూరు పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
సబ్‌-ఇన్‌స్పెక్టర్, కొత్తూరు పోలీస్ స్టేషన్:
8712568383, 8712680427
ఇన్‌స్పెక్టర్, కొత్తూరు పోలీస్ స్టేషన్:
8712680426

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button