
ఎర్రవల్లిలో కానిస్టేబుల్ ఆత్మ*హత్య!
Web desc : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. 10వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. మృతుడు కర్నూలు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించినట్లు సమాచారం.
ఆయన మృతికి గల కారణాలపై భిన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆత్మ*హత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితేనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




