PoliticalsuryapetaTelangana

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. యువ రైతు దుర్మరణం

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. యువ రైతు దుర్మరణం

పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. యువ రైతు దుర్మరణం

సూర్యాపేట మండల పరిధిలోని లక్ష్మి తండాలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తా పడటంతో యువ రైతు లునావత్ లక్ష్మణ్ నాయక్ (30) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ్ నాయక్ ఎప్పటిలాగే వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలంలో ట్రాక్టర్‌తో భూమిని దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద నలిగిపోయిన లక్ష్మణ్ నాయక్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న యువ రైతు అకాల మరణంతో తండాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button