KhammamPoliticalTelangana

శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకున్న వైరా ఎమ్మెల్యే

శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకున్న వైరా ఎమ్మెల్యే

శ్రీ రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకున్న వైరా ఎమ్మెల్యే

ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు అక్టోబర్‌ 17 2026: ఏన్కూరు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దసరా పండుగను పురస్కరించుకుని ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. పండుగ వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజలు, అన్నదాన కార్యక్రమంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్‌ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్‌ చైర్మన్‌ లచ్చిరాం, మాజీ ఎంపీటీసీ మేడం ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button