KhammamPoliticalTelangana

ఫోన్‌ చేసి బెదిరింపులు.. ఖమ్మం జిల్లాలో యువ న్యాయవాది ఆత్మ*హత్య

ఫోన్‌ చేసి బెదిరింపులు.. ఖమ్మం జిల్లాలో యువ న్యాయవాది ఆత్మ*హత్య

ఫోన్‌ చేసి బెదిరింపులు.. ఖమ్మం జిల్లాలో యువ న్యాయవాది ఆత్మ*హత్య

Web desc : పండగ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనను ఎవరో వెంబడిస్తూ, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఓ యువ న్యాయవాది ఆత్మహత్యకు పాల్పడ్డారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే వి.వెంకటాయపాలెంకు చెందిన తొలుపునూరి గణేశ్‌ (27) గత ఏడాది కాలంగా ఖమ్మం కోర్టులో జూనియర్‌ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి తన అన్న సాయితేజతో కలిసి ముదిగొండ మండలం పెద్దమండవలోని అమ్మమ్మ పద్మావతి ఇంటికి వెళ్లాడు. పండగ సందర్భంగా మంగళవారం అమ్మమ్మ పద్మావతి, సాయితేజ గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి గణేశ్‌ ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు.

అది చూసి ఒక్కసారిగా వారు షాక్‌కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, గత నాలుగు రోజులుగా ఎవరో తనను వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని గణేశ్‌ చెప్పినట్లు అతని తండ్రి దానయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కూడా గణేశ్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆరోపించాడు.

ఈ కారణంగా మనస్తాపానికి గురైన కుమారుడికి కొంత మార్పు కల్పించాలనే ఉద్దేశంతో అమ్మమ్మ ఇంటికి పంపించామని, ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుందని తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేశ్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, ఆయనను ఎవరు వెంబడించారు? ఫోన్‌ చేసి బెదిరించిన వ్యక్తులు ఎవరనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button