Medak
Trending

గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు - గ్రామస్తుల చేతిలో చిత్తు,

గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు - గ్రామస్తుల చేతిలో చిత్తు,

గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు – గ్రామస్తుల చేతిలో చిత్తు,

రహస్యంగా రాత్రిపూట తవ్వకాలు,

సర్పంచ్ తో సహా 9,మంది పై కేసు నమోదు,

(సీ కే న్యూస్) చేగుంట

(చిన్న శంకరంపేట)

చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో అర్ధరాత్రి గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న 9 మందిని గ్రామస్తులు పట్టుకుని చితకబాదిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామ సర్పంచ్ భర్త, ఆయన కుమారుడు కూడా ఉండటంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.

సూరారం గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో శనివారం అర్ధరాత్రి కొంత మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని గ్రామస్తులు గమనించారు. అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, 9 మంది వ్యక్తులు గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద పూజా సామాగ్రి, నల్లటి వస్త్రాలు, ఇతర వస్తువులు ఉన్నాయి.

విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని, క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఆగ్రహంతో వారికి దేహశుద్ధి చేశారు.

పట్టుకున్న వారిలో వెల్దుర్తి మండలం రామాయపల్లి గ్రామ సర్పంచ్ భర్త మహేందర్, ఆయన కుమారుడితో పాటు మరో 7 మంది ఉన్నట్లు తెలిసింది. గుప్తనిధులు ఉన్నాయని నమ్మి, రాత్రిపూట రహస్యంగా క్షుద్ర పూజలు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు.

అనంతరం గ్రామస్తులు వారిని చితకబాది, చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చిన్న శంకరంపేట ఎస్ ఐ శివానందం తెలిపారు. క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న 9 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

గుప్తనిధుల పేరుతో మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం సరికాదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన సూరారం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button