
బంజారాహిల్స్ లో ఎస్సై అరెస్టు..
హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం దాడులు చేపట్టారు.లంచం తీసుకుంటుండగా బంజారాహిల్స్ ఎస్సై (SI) విజయ్ను అధికారులు ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఒక కేసు విషయంలో బాధితుడి నుంచి ఎస్సై విజయ్ రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి నుంచి మొదటి విడతగా రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు దాడులు చేసి విజయ్ను పట్టుకున్నారు.ఎస్సై విజయ్ను ఏసీబీ అధికారులు తక్షణమే అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. హైదరాబాద్లోని వీఐపీ ప్రాంతమైన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులు దాడులు చేసి ఎస్సైని అరెస్ట్ చేయడం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది.




