KhammamPoliticalTelangana

అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొంగులేటి

అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొంగులేటి

అర్నబ్ తుఫాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి మంత్రి పొంగులేటి

  • ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు
  • భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టండి
  • పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచనలు

ఖమ్మం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్‌ అర్నబ్ ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తుఫాన్‌ ప్రభావంతో ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అంకిత్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. వాతావరణ పరిస్థితులపై ఆరా తీశారు. రెండు జిల్లాల్లోనూ అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తుఫాన్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button