
మత్తు మందు ఇచ్చి అత్యాచారం, ఆ వీడియోలు చూపించి…
Web desc : హైదరాబాదులోని బండ్లగూడకి చెందిన మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాదు బండ్లగూడకి చెందిన 38 ఏళ్ల దివ్య అనే మహిళకు మరో మహిళ పరిచయమైంది.తన భర్తకు తెలిసినవారు వున్నారనీ, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇంటికి ఆహ్వానించింది.
ఆమె ఇంటికి వచ్చాక కూల్ డ్రింకులో మత్తు మందు కలిపింది. బాధిత మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగానే సదరు మహిళ భర్త బాధిత మహిళపై అత్యాచారం చేసాడు. ఆ సమయంలో వీడియోలు తీసారు.అనంతరం ఆ వీడియోలను చూపించి బాధిత మహిళను బెదిరించసాగారు. తాము చెప్పినట్లు వినకపోతే వీడియోలను లీక్ చేస్తామని అనడంతో ఆమె భయపడిపోయింది.
అదే అదనుగా ఆమె వద్దనున్న 16 తులాల బంగారం తీసుకుని ఓ ప్రైవేట్ బ్యాంకులో పెట్టి రూ. 8 లక్షలు తీసుకున్నారు. ఐనప్పటికీ వేధింపులు ఆపలేదు. గత జూన్ నెలలో మరోసారి బాధిత మహిళను ఇంటికి రప్పించి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




