
కస్తూర్బా పాఠశాలలో విద్యార్థిని మృ*తి…
Web desc : కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థిని మృతి చెందిన సంఘటన సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దావులగల్ల లాస్య సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన లాస్య తిరిగి హాస్టల్ కు వెళ్లింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో లాస్య పుష్పవతి అయిందని పాఠశాల సిబ్బది సమాచారం ఇచ్చారు.
గురువారం తెల్లవారుజూమున 5 గంటల సమయంలో తల్లిదండ్రులు హాస్టల్ కు వెళ్లే సరికి లాస్య ఆరోగ్యం క్షీణించడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే లాస్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరోగ్యంగా ఉన్న తమ కుమార్తె ఆకస్మికంగా మృతి చెందడంపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లాస్య మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం లాస్య మృతదేహం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది.




