
డోర్నకల్‌లో దొంగల హల్‌చల్.. దుకాణం ఇనుప జాలి వంచి నగదు అపహరణ!
Web desc : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారులో దొంగలు హల్‌చల్ సృష్టించారు. తాళ్లూరి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఓ దుకాణంలో చొరబడి కౌంటర్‌లోని నగదును అపహరించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత దుకాణ నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే గురువారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చి షాపు తెరిచి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా కనిపించాయి.
దుకాణం ఇనుప జాలిని వంచి లోపలికి ప్రవేశించిన దొంగలు కౌంటర్‌లోని నగదును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగల ఆనవాళ్లను సేకరించేందుకు క్లూస్ టీంకు సమాచారం అందించినట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



