
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఎమ్మార్వో వాహనం.. తృటిలో తప్పిన ప్రమాదం
Web desc : వనపర్తి జిల్లా ఏదుల మండలంలో శుక్రవారం సాయంత్రం కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏదుల తహసీల్దార్ తస్కిన్ మోబినాకు స్వల్ప గాయాలయ్యాయి.
మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా, ఎస్పీ రెడ్డి ఫర్టిలైజర్ పక్కన ఉన్న ఆన్‌లైన్ సెంటర్ సమీపంలో సాయంత్రం 6 గంటల సమయంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. డ్రైవర్ మద్యం సేవించడంతోనే ప్రమాదం
ప్రమాదంపై తహసీల్దార్ తస్కిన్ మోబినాను వివరణ కోరగా, విధులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తన సొంత కారు మరమ్మతులో ఉండటంతో తెలిసిన వారి కారును తీసుకువచ్చినట్లు వెల్లడించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగిందని, తనకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు.



