HyderabadPoliticalTelangana

టౌన్ ప్లానింగ్ అధికారి ఇళ్లలో ఏసీబీ రైడ్స్..

టౌన్ ప్లానింగ్ అధికారి ఇళ్లలో ఏసీబీ రైడ్స్..

టౌన్ ప్లానింగ్ అధికారి ఇళ్లలో ఏసీబీ రైడ్స్.. హైదరాబాద్, మహబూబ్ నగర్లో 10 చోట్ల సోదాలు

మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి ఇంట్లో ఏసీబీ అధిరానేలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 2026 నవంబర్ 16న (సోమవారం) రైడ్స్ చేస్తున్నారు.

అక్రమ ఆస్తుల ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు కావడంతో వారి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మొత్తం 10 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. స్థిర, చరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తున్నారు. ఆదాయ వనరులు, ఆస్తుల సమీకరణపై వివరాలు సేకరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button