KhammamPoliticalTelangana

కాంగ్రెస్ హామీలు నీటి మూటలే.. మూడేళ్ల పాలనలో ప్రజలకు నిరాశే!

కాంగ్రెస్ హామీలు నీటి మూటలే.. మూడేళ్ల పాలనలో ప్రజలకు నిరాశే!

కాంగ్రెస్ హామీలు నీటి మూటలే.. మూడేళ్ల పాలనలో ప్రజలకు నిరాశే!

పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో రాజకీయ పక్షపాతం తగదు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తీవ్ర విమర్శలు.

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని నవంబర్ 18..
చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో లచ్చయ్య నివాసంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు విమర్శించారు.

ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 400 హామీల పేరుతో ప్రజలకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని విస్మరించిందని ఆరోపించారు. పేరుకు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని విమర్శించారు.

కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీలో గ్రామ సర్పంచులకు కనీస సమాచారం ఇవ్వకుండా, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు తెలియజేయకుండా అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా పత్రాలు పంపిణీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన సర్పంచులకు కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అందిస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలోనూ రాజకీయ పక్షపాతం చూపుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ నిజమైన నిరుపేదలు, గుడిసెల్లో నివసించే పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి పార్టీలు, జెండాలతో సంబంధం లేకుండా ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేల రైతుబంధు, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

మహిళలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు వంటి పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు అందించామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో పక్షపాత ధోరణిని విడనాడి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.

ఈకార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, బొడ్డు వెంకట రామారావు, వంకాయలపాటి వెంకట లచ్చయ్య, గురజాల హనుమంతరావు, గడ్డం శ్రీను, బండి రామారావు, సర్పంచులు కొండూరి పరిశుద్ధ రావు, చాపలమడుగు వీరబాబు, కోపూరి నవీన్, నాదెండ్ల వెంకటేష్, మాజీ సర్పంచులు కాలింగ డేవిడ్, సోమ నాగేశ్వరరావు, తునికిపాటి పూర్ణచంద్రరావు, ఉపసర్పంచ్ ప్రసాదు, నాయకులు పాపినేని రంగారావు, నల్లమోతు రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, పల్లపు అంకాలు, అంబటి వెంకటి, చలువాది లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button