ManchiryalaPoliticalTelangana

విధుల్లో ఉన్నట్లు సంతకాలు.. ఫాంహౌస్‌లో చిందులు! పుట్టినరోజు పేరుతో కానిస్టేబుళ్ల నృత్యాలు

విధుల్లో ఉన్నట్లు సంతకాలు.. ఫాంహౌస్‌లో చిందులు! పుట్టినరోజు పేరుతో కానిస్టేబుళ్ల నృత్యాలు

విధుల్లో ఉన్నట్లు సంతకాలు.. ఫాంహౌస్‌లో చిందులు! పుట్టినరోజు పేరుతో కానిస్టేబుళ్ల నృత్యాలు

Web desc : పోలీస్‌ స్టేషన్‌లో విధులకు హాజరైనట్లు సంతకాలు చేసి, ఓ ఫాంహౌ్‌సలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొందరు పోలీసు సిబ్బంది తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్‌ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో పని చేస్తున్న కొంతమంది కానిస్టేబుళ్లు బర్త్‌డే పార్టీ పేరుతో ఫాంహౌస్‌లో డ్యాన్సులు వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్టేషన్‌లో విధులు నిర్వహించే ఓ మహిళా కానిస్టేబుల్‌ పుట్టిన రోజు నాలుగు రోజుల క్రితం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం తాండూర్‌ మండలంలోని కత్తెర్ల గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో ఆమె తోటి కానిస్టేబుళ్లకు విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు పది మంది పురుష కానిస్టేబుళ్లు, నలుగురు మహిళా కానిస్టేబుళ్లు హాజరయ్యారు.ఫాంహౌస్‌లోని స్విమ్మింగ్‌ఫూల్‌ వద్ద వీరంతా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

అయితే వీరిలో కొందరు డ్యూటీలో ఉన్నట్లు సంతకాలు చేసి మరీ పార్టీకి వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. వేడుకల్లో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌ ఆ వీడియోలను వాట్సా్‌పలో స్టేట్‌సగా పెట్టుకోవడంతో పాటు స్నేహితులకు పంపాడు. అవి కాస్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రామగుండం కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా తీవ్రంగా స్పందించారు.

బాధ్యులైన ఐదుగురు పోలీసులను కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌, చేయగా మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం సహించబోనని సీపీ స్పష్టం చేశారు. పోలీసు శాఖ గౌరవ ప్రతిష్ఠను కాపాడాలనే వృత్తి పరమైన నిబద్ధతతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button