EducationHealthHyderabadNotificationPoliticalTelangana

ఎంబీబీఎస్‌ సీటు పేరుతో మోసం... విద్యార్థిని నుంచి రూ.6.22 లక్షలు వసూలు

ఎంబీబీఎస్‌ సీటు పేరుతో మోసం... విద్యార్థిని నుంచి రూ.6.22 లక్షలు వసూలు

ఎంబీబీఎస్‌ సీటు పేరుతో మోసం… విద్యార్థిని నుంచి రూ.6.22 లక్షలు వసూలు

Web desc : ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానని చెప్పి, ఓ విద్యార్థి నుంచి రూ.6.22 లక్షలు వసూలు చేసి మోసగించిన ఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం మెట్టపాలెం గ్రామానికి చెందిన పి.అనూష ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసి నీట్‌ పరీక్షలకు సిద్ధమవుతోంది.

గత నెల 1న గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. అమీర్‌పేటలోని సితార హోటల్‌కు రావాలని చెప్పడంతో.. 2న తండ్రితో కలిసి అక్కడికి వెళ్లింది. సునీల్‌ పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి అడ్మిషన్‌ ప్రక్రియ వివరించి, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.26,100 మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా చెల్లించాలని కోరాడు.

గతనెల 4న కాలేజీ ఫీజు పేరుతో రూ.లక్ష నగదు తీసుకున్నాడు. బెంగళూరులోని అంబేడ్కర్‌ మెడికల్‌ కాలేజీలో సీటు ఖరారైందని చెప్పి కర్ణాటక ఎగ్జామినేషన్‌ అథారిటీ పేరుతో రూ.2,500 డీడీ చెల్లించాలని సూచించాడు. గత నెల 27న రూ.1.91 లక్షలు, ఈ నెల 7న మరో రూ.3 లక్షలు ఇండియన్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు.

అయినప్పటికీ అడ్మిషన్‌ విషయంలో ఎలాంటి పురోగతీ లేకపోవడంతో వారు సునీల్‌ను నిలదీశారు. తాను అనారోగ్యంతో ఉన్నానని, త్వరలోనే సీటు ఇప్పిస్తానని చెప్పి ఈ నెల 14న వాట్సాప్‌ సందేశం పంపాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, మొత్తం వాపసు చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫోన్లు ఎత్తడం మానేశాడు.

దీంతో బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. మొత్తం రూ.6,22,500 రూపాయలు వసూలు చేసి, సీటు ఇప్పించకుండా మోసగించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button