EducationHyderabadPoliticalTelangana

బాలికపై సహ విద్యార్థి లైంగిక దాడి.. గర్భం దాల్చిన 8వ తరగతి స్టూడెంట్

బాలికపై సహ విద్యార్థి లైంగిక దాడి.. గర్భం దాల్చిన 8వ తరగతి స్టూడెంట్

బాలికపై సహ విద్యార్థి లైంగిక దాడి.. గర్భం దాల్చిన 8వ తరగతి స్టూడెంట్

Web desc ఎనిమిదో తరగతి చదువుతున్న15 ఏండ్ల సహ విద్యార్థి లైంగిక దాడి చేయడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పీఎస్​లో కేసు నమోదైంది. బంజారాహిల్స్​పరిధిలోని ఒక స్కూల్​లో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.

తన స్నేహితుడి అక్క ఆహ్వానం మేరకు సెప్టెంబర్​లో వారి ఇంటికి వెళ్లగా సహ విద్యార్థి లైంగిక దాడి చేశాడు. ఎవరికీ చెప్పవద్దని బెదిరించండంతో మౌనంగా ఉండిపోయింది.

రెండు నెలలుగా నెలసరి రాకపోవడం, ఇష్టమైన ఆహారం తినాలనే కోరికలు పెరగడం, ఆరోగ్య పరిస్థితిలో మార్పులు కనిపించడంతో కుటుంబసభ్యులకు ప్రెగ్నెన్సీ టెస్ట్​చేయించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో బాధితురాలి తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button