KhammamPoliticalTelangana

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సర్పంచ్!

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సర్పంచ్!

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సర్పంచ్!

ఖమ్మం జిల్లా : గ్రానైట్‌ క్వారీల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూస్తానంటు రూ.13 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన మహబూబాబాద్‌ జిల్లా సర్పంచ్‌, బుధవారం ఏసీబీ వలకు చిక్కాడు. ఈ మొత్తంలో మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా వరంగల్‌ ఏసీబీ అధికారులు వల పన్ని ఖమ్మంలో అతడిని పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం మోదుగడ్డ తండాకు చెందిన సర్పంచ్‌ ధరావత్‌ వీరు ఖమ్మంలోని శారదా స్టోన్స్‌, ప్రీమియర్‌ గ్రానైట్స్‌, రాశి గ్రానైట్స్‌ సంస్థలకు చెందిన క్వారీల కార్యకలా పాలు గ్రానైట్‌ వ్యాపారం సజావుగా సాగేందుకు అధికారికంగా అనుకూలంగా వ్యవహరిస్తానంటూ వీరు లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

తొలుత రూ.30 లక్షలు అడిగిన ఆయన.. అనంతరం ఆ డిమాండ్‌ను రూ.13 లక్షలకు తగ్గించినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా తొలి విడత సొమ్ము రూ.2 లక్షలు తీసుకునేందుకు అంగీకరించినట్లు ఏసీబీ పేర్కొంది.

ఫిర్యాదుదారుడి కార్యాలయంలో రూ.2 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి వీరును పట్టుకుంది. ట్రాప్‌ ప్రక్రియలో లంచం సొమ్మును స్వాధీనం చేసుకు న్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి, విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.

నిందితుడు ధరావత్‌ వీరును అరెస్టు చేసి, వరంగల్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ వెల్లడించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button