
హుజూర్ నగర్ ఎస్ఐ సస్పెండ్…
Web desc : బుల్లెట్ బైక్ వివాదం వైరల్ కావడంతో.. సూర్యాపేట జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు. .దొంగలించిన బుల్లెట్ బైక్ తిరిగి ఇతర వ్యక్తులకు అందజేశారు అనే వార్త సోషల్ మీడియాలో కలకలం రేపింది.
దీంతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్ఐ చలికంటి నరేష్ ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకెళ్తే వనస్థలిపురం ఏరియా కు చెందిన ఓ వ్యక్తి తన బుల్లెట్టు బైకు దొంగిలించబడిందని వనస్థలిపురంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో విచారణ చేపట్టిన వనస్థలిపురం పోలీసులు హుజూర్ నగర్ పట్టణములో బుల్లెట్ బైక్ తిరుగుతుంది అనే సమాచారం మేరకు వనస్థలిపురం పోలీసులు హుజూర్ నగర్ పట్టణానికి వచ్చి దొంగలించిన బుల్లెట్టు బైక్ ను స్వాధీనం చేసుకుని హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పారు.
దీంతో హుజూర్ నగర్ ఎస్సై స్థానిక నాయకుల ఒత్తిడి మేరకు ఆ బుల్లెట్ బైక్ను తిరిగి హుజూర్నగర్ పట్టణానికి చెందిన వ్యక్తికి అప్పజెప్పారని వనస్థలిపురం పోలీసులు సూర్యాపేట జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈవిషయమై పోలీసు ఉన్నత అధికారులు ప్రాథమిక విచారణ చేసి.. ఎస్ఐ చలికంటి నరేష్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.కాగా ఎస్ఐ నరేష్ గతంలో గరిడేపల్లి పోలీస్ స్టేషన్లలో పని చేసిన సమయంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించినట్లు సమాచారం.




