KhammamPoliticalTelangana

భార్యను మోసం చేసిన డాక్టర్ బాబు.. హాస్పిటల్ ముందు భార్య ఆందోళన

భార్యను మోసం చేసిన డాక్టర్ బాబు.. హాస్పిటల్ ముందు భార్య ఆందోళన

భార్యను మోసం చేసిన డాక్టర్ బాబు.. హాస్పిటల్ ముందు భార్య ఆందోళన

Web desc : ఖమ్మం జిల్లా కల్లూరు మునిసిపాలిటీలోని మోహన్ హాస్పిటల్ ముందు మూడేళ్ళ పాపతో కలిసి మహిళ ఆందోళన దిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. డాక్టర్ మోహన్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడని, తనకు తెలియకుండా విడాకులు సృష్టించాడని ఆరోపిస్తూ అతని భార్య కుసుమ ఆందోళనకు దిగింది.

తనకూ, మూడేళ్ళ పాపకు స్టెరాయిడ్స్ ఇచ్చి మానసికంగా వేధించాడని ఆమె కన్నీరుమున్నీరయింది. డాక్టర్ మోహన్ వేరే మహిళతో సహజీవనం చేస్తూ తనను, పాపను వదిలేశాడని ఆరోపించింది. పెళ్లి ఫొటోలను చూపిస్తూ న్యాయం చేయాలని మోహన్ హాస్పిటల్ ముందు బంధువులతో ఆందోళనకు దిగింది.

ఈ ఘటన కల్లూరు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వైద్యుడిపై భార్య చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీయగా, మరోవైపు ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

అయితే కుసుమ చేసిన ఆరోపణలపై డాక్టర్ మోహన్ స్పందన, అధికారిక విచారణ వివరాలు తెలియాల్సి ఉంది. తనకు, తన కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని కుసుమ స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button