KhammamPoliticalSathupallyTelangana

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.. ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్!

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.. ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్!

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.. ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్!

సత్తుపల్లి: గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడగా, మరో ఆరుగురు పరారయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

వి.ఎం. బంజర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తగూడెం గ్రామ శివారులోని వాగు సమీపంలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు అక్కడ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఆరుగురు అక్కడి నుంచి పరారయ్యారు.

పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button