HyderabadPoliticalTelangana

ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి.. యువతిపై లైంగిక దాడికి యత్నం

ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి.. యువతిపై లైంగిక దాడికి యత్నం

ఉద్యోగం పేరుతో హోటల్‌కు పిలిచి.. యువతిపై లైంగిక దాడికి యత్నం

బంజారాహిల్స్‌ : స్నాప్‌చాట్‌ ద్వారా పరిచయమైన ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి హోటల్‌కు పిలిచాడో యువకుడు. నమ్మివచ్చిన ఆమెను కత్తితో బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్‌ చేయడమే కాకుండా లైంగికదాడి కి యత్నించాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ఓ యువతి (27) ప్రస్తుతం అత్తాపూర్‌లోని శివానగర్‌ కాలనీలో నివసిస్తూ స్వయం ఉపాధి పొందుతోంది. ఐదునెలల క్రితం ఆమెకు స్నాప్‌చాట్‌ ద్వారా కార్తిక్‌ (32) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన కార్తీక్‌, ఈ నెల 23న బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌కు రావాలని ఆమెకు సూచించాడు.

అతడి మాటలు నమ్మిన బాధితురాలు ఆ హోటల్‌కు వెళ్లింది. లాబీలో కొద్దిసేపు మాట్లాడుకున్నాక కార్తిక్‌ ఆమెను హోటల్‌ గదిలోకి తీసుకెళ్లాడు. అనంతరం కత్తి చూపించి రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

నగ్న వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అతికష్టంమ్మీద కార్తిక్‌ బారి నుంచి ఆ యువతి తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ గదిలోనే పడిపోయిన యువతి సెల్‌ఫోన్‌ను తీసుకొని కార్తిక్‌ పరారయ్యాడు. ఆ తర్వాత ర్యాపిడో డెలివరీ ద్వారా ఆ ఫోన్‌ను బాధితురాలికి పంపించాడు.

ఈ నెల 24న బాధితురాలు ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్‌ పోలీసులు కార్తిక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్‌లోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు మొదలెట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button